Leading News Portal in Telugu

Hamas releases two Israeli hostages


  • మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్
  • రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించిన హమాస్
Hamas: మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్

హమాస్.. మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. ఇద్దరు బందీలను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. తాల్ షాహమ్, అవెరు మెంగిస్తులను రెడ్ క్రాస్ అధికారులకు అప్పగించారు. ఇజ్రాయెల్ బందీ తాల్ షోహమ్‌ను విడుదల సమయంలో వేదికపైన హమాస్ నడిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Shivraj Singh: ఎయిరిండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిపోయిన సీటులో ప్రయాణం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో ఇరు దేశాలు మధ్య బందీలు-ఖైదీల మార్పిడి జరుగుతోంది. హమాస్.. బందీలను విడుదల చేస్తుంటే.. ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. ఇలా రెండు దేశాల మధ్య తొలి విడత ఒప్పందం సాగింది. చివరి దశలో ఆరుగురు ఇజ్రాయెల్ బందీల్లో ఎలియా కోహెన్, ఒమర్ షెమ్ టోవ్, ఒమర్ వెంకర్ట్, హిషామ్ అల్-సయ్యద్, తాల్ షోహమ్ మరియు అవెరు మెంగిస్తు ఉన్నారు.

అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. దీంతో వందలాది మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. గాజా పూర్తిగా ధ్వంసం అయింది. ఇక ఈజిప్ట్, ఖతర్ దేశాల అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగింది.

ఇది కూడా చదవండి: Odela 2: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఓదెల‌2 టీజ‌ర్