Leading News Portal in Telugu

Trump praises Friedrich Merz as Germany’s next Chancellor, calling it a “great day”.


  • జర్మనీ జాతీయ ఎన్నికల్లో సంచలనం..
  • తదుపరి ఛాన్సలర్‌గా ఫ్రెడ్‌రిక్ మెర్జ్..
  • జర్మనీకి ‘‘గొప్ప రోజు’’ అంటూ ట్రంప్ ప్రశంసలు..
German Election: జర్మనీ తదుపరి ఛాన్సలర్‌గా ఫ్రెడరిక్ మెర్జ్.. ‘‘గొప్ప రోజు’’ అంటూ ట్రంప్ ప్రశంసలు..

German Election: జర్మనీ జాతీయ ఎన్నికల్లో సంచలనం నమోదు కాబోతోంది. తదుపరి జర్మనీ ఛాన్సలర్‌గా కన్జర్వేటివ్ కూటమి విజయం దిశగా వెళ్తోందని ఆదివారం అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మరోవైపు ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తన ఓటమిని అంగీకరించారు. తదుపరి ఛాన్సలర్ కాబోతున్న ఫ్రెడ్రిక్ మెర్జ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సీడీయూ/సీఎస్‌యూ కూటమి 28.5 ఓట్ల శాతంతో 208 సీట్లను దక్కించుకోనుంది. 20.7 ఓట్లతో రైటిస్ట్ గ్రూప్ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) రెండో స్థానంలో నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఛాన్సలర్ స్కోల్జ్ సోషల్ డెమోక్రాట్స్ (SPD) పార్టీ 16.5 శాతం ఓట్లతో చెత్త ఫలితాన్ని నమోదు చేసింది.

అయితే, ఈ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారుగా ఉన్న బిలియనీర్ ఎలాన్ మస్క్ ఏఎఫ్‌డీ మంచి ఫలితాలను సాధిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలను స్వాగతించారు. జర్మనీ ప్రజలు ఒలాఫ్ స్కోల్జ్ నేతృత్వంలోని సెంటర్ లెఫ్ట్ గవర్నమెంట్ ప్రభుత్వ విధానాలను తిరస్కరించారని అన్నారు. అమెరికా మాదిరిగానే జర్మనీ ప్రజలు కూడా చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఇంగితజ్ఞానం లేని ఎజెండాతో, ముఖ్యంగా ఇంధనం,వలసలపై విసుగు చెందారని అన్నారు. ఇది జర్మనీకి గొప్ప రోజు అంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో కొనియాడారు.

ఇదిలా ఉంటే, జర్మనీకి తదుపరి ఛాన్సలర్ కాబోతున్న ఫ్రెడ్‌రిక్ మెర్జ్ నిజమైన స్వాతంత్య్రం కోసం పిలుపునిచ్చారు. ‘‘యూరప్‌కి అమెరికా నుంచి నిజమైన స్వాతంత్య్రం ఇవ్వడానికి సాయం చేస్తాను’’ అని అన్నారు. జర్మనీలో ప్రభుత్వ మార్పుని ట్రంప్ స్వాగతించినప్పటికీ, మెర్జ్ తన విజయం తర్వాత అమెరికాను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యల్ని రష్యా నుంచి వచ్చిన శత్రు దేశాల వ్యాఖ్యలుగా పోల్చారు.

తన ప్రాధాన్యత యూరప్‌ని వీలైనంత త్వరగా బలోపేతం చేయడం, దశలవారీగా అమెరికా నుంచి నిజమైన స్వాతంత్య్రం సాధించడం అని అన్నారు. దశాబ్దాలుగా యూరప్ భద్రకు మద్దతు ఇస్తున్న నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటూ) తదుపరి శిఖరాగ్ర సమావేశం వరకు నాటో ప్రస్తుత రూపంలో ఉంటుందా అని అడిగారు. యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.