Leading News Portal in Telugu

trump buys new red tesla to show support for elon musk


  • టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్
  • మస్క్‌ను కూర్చోబెట్టుకుని స్వయంగా నడిపిన ట్రంప్
Trump: టెస్లా కారు కొనుగోలు చేసి స్వయంగా నడిపిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కొత్త టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎరుపు రంగు టెస్లా కారును కొనుగోలు చేశారు. అనంతరం కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్‌తో కలిసి ట్రంప్‌ కలియ తిరిగారు. తన స్నేహితుడికి మద్దతుగా కొత్త టెస్లా కారు కొంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ కారు కొనుగోలు చేసి వైట్‌హౌస్ ఎదుట డ్రైవింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Borugadda Anil: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో ట్విస్ట్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. మస్క్ పక్కసీటులో కూర్చున్నాడు. ఇద్దరూ కూడా ఉల్లాసంగా ఉన్నట్లు కనిపించారు. కారు చాలా అందంగా ఉందని ట్రంప్ ప్రశంసించారు. ఇక కారు ఎలా స్టార్ట్ చేయాలో ఇద్దరూ సంభాషించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారు గంటకు 95 కిలోమీటర్లు వెళ్తోంది.

ఇది కూడా చదవండి: Dil Ruba : కిరణ్ కాన్ఫిడెన్స్.. ఒకరోజు ముందుగా దిల్ రూబా ప్రీమియర్స్.

తనకు డిస్కౌంట్ వద్దని ట్రంప్ పేర్కొ్న్నారు. మస్క్ డిస్కౌంట్ ఇస్తానన్నా వద్దని చెప్పానన్నారు. ఇది చాలా బాగుందని ప్రశంసించారు. మార్కెట్ ధరకే కారు కొనుగోలు చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ కొనుగోలు తర్వాత టెస్లా మార్కెట్ భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.