Leading News Portal in Telugu

Trump administration considers travel restrictions on 43 countries; Pakistan, North Korea on list


  • 43 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్..!
  • జాబితాలో పాక్, నార్త్ కొరియా, రష్యా..
  • మూడు జాబితాలుగా దేశాల వర్గీకరణ..
Trump travel Ban: ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించే 43 దేశాలు ఇవే.. మూడు జాబితాలు రెడీ..

Trump travel Ban: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో వణుకు మొదలైంది. ట్రంప్ తన సుంకాలతో పెద్ద వివాదానికి తలుపులు తెరిచారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలను విధించారు. మరోవైపు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపారు. తాజాగా, కొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాల నుంచి వచ్చే వారికి అమెరికాలోకి ప్రవేశం ఉండదు.

మొత్తం 43 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలను 3 జాబితాలుగా వర్గీకరించారు. ఈ జాబితాలో పాకిస్తాన్, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.

1) రెడ్ లిస్ట్: రెడ్ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజులా, యెమెన్‌లతో వంటి 11 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి అమెరికాకు ప్రయాణించకుండా నిషేధించబడుతారు.

2) ఆరెంజ్ లిస్ట్: ఈ లిస్టులో ఉండే దేశాలు పూర్తిగా ప్రయాణ ఆంక్షలు ఎదుర్కోవు. అయితే, కొన్ని ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటాయి. ఈ సమూహంలో బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియెర్రా లియోన్, దక్షిణ సూడాన్, తుర్క్‌మెనిస్తాన్ వంటి 10 దేశాలు ఉన్నాయి.

3) ఎల్లో లిస్ట్: ఈ జాబితాలో మొత్తం 22 దేశాలు ఉండే అవకాశం ఉంది. అమెరికా గుర్తించిన లోపాలను సవరించుకోవడానికి 60 రోజుల గడువు ఇవ్వబడుతుంది. ఈ దేశాలు యూఎస్ షరతులను పాటించకపోతే, మిగిలిన రెండు జాబితాల్లోకి ఈ దేశాలు చేరుతాయి.

ఎల్లో లిస్టులో అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామెరూన్, కేప్ వెర్డే, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కాంగో, డొమినికా, ఈక్వటోరియల్ గినియా, గాంబియా, లైబీరియా, మలావి, మాలి, మౌరిటానియా, సెయింట్. కిట్స్ మరియు నెవిస్, సెయింట్. లూసియా, సావో టోమ్ అండ్ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే ఉన్నట్లు తెలుస్తోంది.