Leading News Portal in Telugu

Driverless minibuses successfully tested in downtown Barcelona ​​Spain


  • దేశంలో డ్రైవర్‌ రహిత మినీ బస్సు పరుగులు
  • స్పెయిన్‌లోని బార్సిలోనా డౌన్‌టౌన్‌లో డ్రైవర్‌లేని మినీబస్సులను విజయవంతంగా పరీక్షించారు
  • ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి రీఛార్జ్ చేయడం ద్వారా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది
Spain: రవాణా రంగంలో అద్భుతం.. దేశంలో డ్రైవర్‌ రహిత మినీ బస్సు పరుగులు..

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇప్పుడు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఏకంగా డ్రైవర్ రహిత బస్సులు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండానే రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. అయితే ఇది మనదేశంలో కాదండోయ్.. స్పెయిన్ లో అందుబాటులోకి వచ్చాయి. స్పెయిన్‌లోని బార్సిలోనా డౌన్‌టౌన్‌లో డ్రైవర్‌లేని మినీబస్సులను విజయవంతంగా పరీక్షించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

బస్సు ప్రయాణికులతో స్టాప్ నుంచి బయలుదేరి, లేన్ మారే ముందు బ్రేక్ వేసి నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపించింది. ఈ పరీక్షను రెనాల్ట్ నిర్వహించింది. ఈ బస్సు నాలుగు స్టాపులతో 2.2 కి.మీ దూరం ప్రయాణించింది. ఈ ప్రోటోటైప్ మినీబస్సు కోసం ఫ్రెంచ్ కార్ల తయారీదారు WeRide కంపెనీతో జతకట్టింది.గత సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ వేదిక వద్ద డ్రైవర్‌లెస్ బస్సును ఆవిష్కరించారు. ఇప్పుడు బార్సిలోనాలోని ఒక ప్రధాన రహదారిపై దీనిని పరీక్షించారు.

శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టోక్యో వరకు ఇతర నగరాల్లో కూడా కంపెనీలు డ్రైవర్‌లెస్ టాక్సీలు, బస్సులను పరీక్షిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి రీఛార్జ్ చేయడం ద్వారా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. డ్రైవర్ రహిత మినీ బస్సుకు 10 కెమెరాలు, ఎనిమిది లైడార్లు (సెన్సార్ శ్రేణులు) అమర్చారు. ఇవి కార్లు, మోటార్ సైకిళ్ళు, పాదచారులతో నిండిన వీధులను నావిగేట్ చేయడానికి సహాయపడతాయి. బార్సిలోనా వంటి రద్దీగా ఉండే నగరం గుండా ఇచ్చిన మార్గంలో బస్సు సురక్షితంగా ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.