Leading News Portal in Telugu

Trump Putin phone call likely this week amid Russia Ukraine peace talks


  • ఈ వారంలో ట్రంప్-పుతిన్ భేటీ అయ్యే ఛాన్స్
  • యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ను కోరనున్న ట్రంప్
Trump-Putin: ఈ వారంలో ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు జరిగే ఛాన్స్

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా అధికారులు-రష్యాతో చర్చలు జరుపుతున్నారు. మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను అమెరికా కోరింది. దీనికి ఉక్రెయిన్ సానుకూల సంకేతాలు ఇవ్వగా.. రష్యా నుంచి మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వారం కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు ఉంటాయని అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. ఇరువురి మధ్య చర్చల తర్వాత పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Hit3 : నాని ‘హిట్ 3’ కి ఓటిటి లో భారీ ధర !

ఇదిలా ఉంటే అమెరికా-రష్యా మధ్య కూడా సంబంధాలు మెరుగుపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అలాగే రష్యా కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలని పుతిన్‌ను ట్రంప్ కోరనున్నారు. ఇక ఈ భేటీలో మరికొన్ని డిమాండ్లు.. ట్రంప్ ముందు పెట్టేందుకు పుతిన్ జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Tamil Nadu: డీఎంకే టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలు.. వైన్ షాపుల ముట్టడికి పిలుపు

గత మూడేళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్‌‌లో చాలా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అలాగే అమెరికా మద్దతుతో ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులు చేసింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. యుద్ధం ముగింపుపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు చర్చలు జరిగాయి. దాదాపు కొలిక్కి వస్తున్నట్లు సూచనలు కనిపిస్తు్న్నాయి. త్వరలో ట్రంప్-పుతిన్ భేటీ తర్వాత యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Weather Updates : తెలంగాణలో మండుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌