- ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఫొటో విడుదల చేసిన వాటికన్
- ఫిబ్రవరి 14 నుంచి ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్(88)కు చెందిన తాజా ఫొటోను వాటికన్ విడుదల చేసింది. ఆస్పత్రిలో ఉన్న ఫొటోను ఆదివారం విడుదల చేసింది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఫిబ్రవరి 14న రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన బాహ్య ప్రపంచానికి కనబడలేదు. తాజాగా పోప్‌కు సంబంధించిన ఫొటో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే వైద్యులు.. పలు రకాలైన టెస్టులు నిర్వహించారు. అనంతరం న్యుమోనియాకు డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వాటికన్ తెలిపింది.
ఆస్పత్రిలో ఒక ప్రార్థనా మందిరాన్ని పోప్ కోసం ఏర్పాటు చేశారు. బలిపీఠం ఎదురుగా కూర్చున్న ఫొటోను వెనుక నుంచి తీశారు. పోప్ ముఖం మాత్రం ఫొటోలో కనిపించలేదు. కుడి చేయి ఒడిలో పెట్టుకున్నారు. అయితే ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లుగా ఎలాంటి పరికరాలు మాత్రం కనిపించలేదు. అంటే ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందించడం లేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శనివారం విడుదలైన హెల్త్ బులెటిన్ సమాచారం మేరకు పోప్ ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతుందని.. శ్వాస కూడా తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక రాత్రి పూట మాత్రం యాంత్రిక వెంటిలేషన్ ఉపయోగిస్తున్నట్లు వాటికన్ తెలిపింది. అయితే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో మాత్రం వైద్యులు వెల్లడించలేదు. అయితే ఆరోగ్యం మాత్రం నెమ్మదిగా కుదిటపడుతుందని పేర్కొన్నారు. ఇక గురువారం ఆస్పత్రి నుంచి పోప్‌గా ఎన్నికైన 12వ వార్షికోత్సవాన్ని ఫ్రాన్సిస్ జరుపుకున్నారు. ఇదిలా ఉంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పోప్‌గా ఫ్రాన్సిస్‌నే కొనసాగనున్నారు.