Leading News Portal in Telugu

trump to sign order to shut down department of education white house says


  • మరో బాంబ్ పేల్చిన ట్రంప్
  • విద్యాశాఖ మూసివేత వేసే దిశగా అడుగులు!
  • గురువారం సంతకం చేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటన
Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. విద్యాశాఖ మూసివేత!

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధికారం చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ పాలన చాలా దూకుడుగా కనిపిస్తోంది. ఇటీవల వాణిజ్య యుద్ధం ప్రకటించగా మార్కెట్లు చతికలపడ్డాయి. అనంతరం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అలాగే సంస్థాగతంగా కూడా పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యయం తగ్గించుకునేందుకు ఉద్యోగుల కోత విధించారు. తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఏకంగా విద్యాశాఖనే మూసివేసే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారు. విద్యాశాఖ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని.. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ విభాగాన్ని మూసివేసే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేయబోతున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Hama-Israel: హమాస్‌కు చివరికి హెచ్చరిక.. తక్షణమే బందీలను విడుదల చేయాలని అల్టిమేటం

విద్యా శాఖను మూసివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ గురువారం సంతకం చేస్తారని వైట్ హౌస్ బుధవారం తెలిపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ హామీని నెరవేరుస్తున్నారని తెలిపింది.

ఇది కూడా చదవండి: Tollywood : అలాంటి పాటలు చేయకూడదు అని గట్టి నియమం పెట్టుకున్నా