Leading News Portal in Telugu

US government shuts down Department of Education


  • యుఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను రద్దు చేస్తూ ఉత్తర్వుపై సంతకం
  • అమెరికాలో డబ్బు ఆదా చేయడానికి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య
Donald Trump: యుఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాశాఖ రద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. అధికారం చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. వలసలను కఠినతరం చేస్తూ.. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ సంచలనంగా మారారు. తాజాగా యూఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను రద్దు చేస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. వైట్ హౌస్ తూర్పు గదిలోని డెస్క్‌ల వద్ద కూర్చున్న పాఠశాల పిల్లలతో ఒక ప్రత్యేక కార్యక్రమంలో సంతకం చేసిన తర్వాత ట్రంప్ నవ్వుతూ ఆర్డర్‌ను పైకిఎత్తి చూపారు. ఈ ఉత్తర్వుతో సమాఖ్య విద్యా శాఖ శాశ్వతంగా రద్దు చేయడం ప్రారంభమవుతుందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

ట్రంప్ విద్యా శాఖను పనికిరానిదిగా, ఉదారవాద భావజాలంతో కలుషితం చేసిందని అభివర్ణించారు. అమెరికాలో డబ్బు ఆదా చేయడానికి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య అవసరమని ట్రంప్ అభివర్ణించారు. అయితే, ఆ విభాగం పూర్తిగా మూసివేయబడదు. ఈ విభాగం కొన్ని కీలకమైన విధులను కొనసాగిస్తుందని వైట్ హౌస్ తెలిపింది. 1979లో ఏర్పాటు చేసిన విద్యా శాఖను కాంగ్రెస్ ఆమోదం లేకుండా మూసివేయలేము. దీనిని సాధించడానికి బిల్లును ప్రవేశపెడతామని రిపబ్లికన్లు చెప్పారు.