Leading News Portal in Telugu

భారత్‌కు ఆరు అపాచీ హెలికాప్టర్లు

వాషింగ్టన్‌: అత్యాధునిక అపాచీ ఎటాక్‌ హెలికాప్టర్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఆరు ఏహెచ్‌– 64ఈ అపాచీ ఎటాక్‌ హెలికాప్టర్లతో పాటు హెల్‌ఫైర్, స్టింగర్‌ క్షిపణులను భారత్‌కు అమ్మేందుకు ట్రంప్‌ యంత్రాంగం ఆమోదం తెలిపినట్టు పెంటగాన్‌ బుధవారం తెలిపింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ.6 వేల కోట్లు.

వీటి చేరికతో భారత సైనిక బలగం బలోపేతం కావడంతో పాటు ప్రాంతీయ ఉద్రిక్తతలకు చెక్‌ చెప్పవచ్చని పెంటగాన్‌ పేర్కొంది. ఈ మేరకు ప్రభు త్వ నిర్ణయాన్ని పెంటగాన్‌ డిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ.. కాంగ్రెస్‌కు తెలియజేసింది. కాంగ్రెస్‌ సభ్యులెవరూ వ్యతి రేకించకపోతే దీనికి ఆమోదం లభిస్తుంది. ఫైర్‌ కంట్రోల్‌ రాడార్లు, హెల్‌ఫైర్‌ లాంగ్‌బో క్షిపణులు, స్టింగర్‌ బ్లాక్‌ ఐ–92హెచ్‌ క్షిపణులు, నైట్‌ విజన్‌ సెన్సార్లు, అత్యాధునిక నావిగేషన్‌ సిస్టమ్‌లను కూడా అమెరికా విక్రయించనుంది.