కరోనా విలయతాండవంక్రైమ్ట్రెండింగ్బిజినెస్బిజినెస్ ఐడియాఅంతర్జాతీయంఆరోగ్యంటెక్నాలజీWin 1 Lakh – MC PRO Contest హోమ్ » న్యూస్ » కరోనా విలయతాండవం కరోనా కోసం ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్ల తయారీ… WHO గుడ్ న్యూస్…
ప్రపంచాన్ని చంపుతున్న కరోనా వైరస్‌ని చంపేందుకు ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది. ఈ 70లో మూడు వ్యాక్సిన్లను ముగ్గురు వ్యక్తులపై (human trials) ప్రయోగిస్తున్నారు కూడా. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది ఏదంటే… కరోనా వ్యాక్సినే అని మనం చెప్పుకోవచ్చు. బట్ అది ఇంకా తయారవ్వలేదు. దాని తయారీలో 70 ఫార్మా కంపెనీలు, సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఏదో ఒకటి సక్సెస్ అయినా చాలు… కరోనా కథ ముగిసినట్లే.
హాంకాంగ్‌కి చెందిన కాన్సినో బయోలాజిక్స్ (cansino biologics), చైనా బీజింగ్‌కి చెందిన బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి ఓ వ్యాక్సిన్ తయారుచేశాయి. దాన్ని మనుషులపై ప్రయోగిస్తున్నాయి. ఈ ప్రయోగాలు తొలి దశ ముగిసి… రెండో దశకు చేరాయి. అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్స్ (Inovio Pharmaceuticals)తోపాటూ… మరో కంపెనీ కూడా… మనుషులపై తమ వ్యాక్సిన్లను ప్రయోగిస్తున్నాయి.
చూస్తుంటే… ఈ వ్యాక్సిన్ తయారీ చాలా కాలం పడుతోందే అని మనకు అనిపించవచ్చు. నిజానికి ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ వైరస్‌కీ ఇంత వేగంగా, ఇంత ఎక్కువగా వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియ జరగలేదు. తక్కువ సమయంలో వ్యాక్సిన్ సృష్టించి… మార్కెట్లకు పంపాలని అన్ని కంపెనీలూ తపనపడుతున్నాయి. సాధారణంగా ఓ వ్యాక్సిన్ తయారు చెయ్యడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. కరోనా వ్యాక్సిన్ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచమంతా చేరుకునేలా ప్లాన్స్ వేస్తున్నారు.