కోవిడ్ వైరస్ ల్యాబ్‌లో పుట్టింది కాదు…అమెరికాపై జర్మనీ మండిపాటు…
చైనాలోని ఓ ల్యాబ్‌లో కోవిడ్ – 19 వైరస్ సృష్టించారని అమెరికా చేస్తున్న వార్తలను చైనా విదేశాంగా శాఖ తోసి పుచ్చింది. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా ఇదే సంగతి నిర్ధారించిందని చైనా విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. వుహాన్ ప్రాంతంలోని ఓ లేబొరేటరీలో కరోనా వైరస్‌ను పుట్టించారనే వార్తలను చైనా తోసిపుచ్చింది అంతేకాదు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జో లిజన్ వివరణ ఇచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించలేదని డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు నిగ్గు తేల్చారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో సృష్టించారని ఇదే అంశాన్ని తమ ప్రభుత్వం విచారించి అసలు నిజాలు బయటపెడతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే చైనా మాత్రం ఇలాంటి చవకబారు ఆరోపణలకు దూరంగా ఉండాలని అమెరికాను హెచ్చరించింది. అంతేకాదు కరోనా విషయంలో తాము ప్రపంచానికి ఎంతో సహాయం చేస్తున్నామని తేల్చింది.
ఇదిలా ఉంటే చైనా నుంచి ఫ్రాన్స్, జర్మనీలకు వెళ్లే మెడికల్ ఎక్విప్ మెంట్ విమానాన్ని అమెరికా దౌర్జన్యంగా హైజాక్ చేసిందని ఆరోపణలు కూడా చేసింది. బ్యాంకాక్ నుంచి బెర్లిన్ బయలు దేరే మెడికల్ ఎక్విప్ మెంట్ విమానాన్ని, యూఎస్ కు చెందిన ఓ లాజిస్టిక్ కంపెనీ ద్వారా బుక్ చేయగా, సదరు లాజిస్టిక్ కంపెనీ ఆ విమానం జర్మనీ కు చేరకుండా అమెరికాకు డైవర్ట్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై జర్మనీ మండిపడుతోంది.