ఓరీ…ట్రంప్…నిద్ర నుంచి మేలుకో..న్యూయార్క్ గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు…
ఒకవైపు న్యూయార్క్‌లో పిట్టల్లా రాలుతున్న జనం. రోజులు గడిచేకొద్దీ మరింతగా వ్యాప్తి చెందుతూ వెంటాడుతున్న వైరస్ భూతం.. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు రావలసిన సహాయం ఆశించినంత రాకపోవడం, దీంతో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో అమెరికా అధ్యక్షుడిపై మండిపడ్డారు. దేశంలోని బడా వాణిజ్యవర్గాలకు ప్యాకేజీలు అందిస్తూ రాష్ట్రాలకు సహాయం మాట మరిచిన ట్రంప్ ఇకనైనా టీవీ చూస్తూ కూర్చోవడం మాని నిద్రమేల్కొని తన బాధ్యతలను సరిగా నిర్వర్తించాలని గవర్నర్ కువోమో ధ్వజమెత్తారు. దేశంలోని విమానయాన సంస్థలు, ఇతర వాణిజ్య పెట్టుబడిదారులకు బెయిలవుట్ ప్యాకేజ్ అదించిన ట్రంప్ రాష్ట్రాలకు మాత్రం చేయి విదల్చలేదని మండిపడ్డారు.