కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమం? .. మృత్యువుతో పోరాడుతున్న నార్త్ కొరియా నియంత?
ఏప్రిల్ మొదట్లో జరిపిన ఓ సర్జరీ కారణంగా… ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్… ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉత్తరకొరియా మీడియా మాత్రం కన్ఫామ్ చెయ్యలేదు. కిమ్‌కి ఆరోగ్యం బాలేదన్న విషయంపై ప్రభుత్వ అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఉత్తర కొరియాలో కొత్తగా వచ్చిన యొన్హాప్ (yonhap) తెలిపింది. అలాగే… ఆ అధికారులు… ఉత్తరకొరియా అధికారులా లేక దక్షిణ కొరియా అధికారులా అన్నది కూడా అనుమానాస్పదంగా ఉంది. కిమ్‌కి జరిగిన సర్జరీ వల్ల ఆయన ఆరోగ్యం విషమంగా మారిందన్న ఓ అమెరికా అధికారి వ్యాఖ్యలపై తాము వెంటనే నిర్ధారణకు రాలేమని దక్షిణ కొరియా యూనిఫికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో సర్జరీ తర్వాత… కిమ్ జోంగ్ ఉన్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏప్రిల్ 11న ఆయన చివరిసారిగా ప్రజలకు కనిపించారు. తన తాతగారు, ఆ దేశ జాతి పిత కిమ్ 2 సంగ్‌కి సంబంధించిన డే ఆఫ్ ది సన్ వేడుకలకు కూడా కిమ్ హాజరు కాలేదు.
మార్చిలో… అమెరికా అధ్యక్షుడు ట్రంప్… కిమ్‌కి ఓ వ్యక్తిగత లేఖ రాశారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాల్ని కోరుకుంటున్నట్లు అందులో తెలిపారు. కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలుస్తామన్నారు. ఐతే… ట్రంప్ ప్రతిపాదనలను కిమ్ జోంగ్ సోదరి… కిమ్ యో జోంగ్… సున్నితంగా తిరస్కరించారు.