కిమ్ జోంగ్ ఉన్ చనిపోయాడా? నివాళి అర్పిస్తున్న నెటిజన్లు…
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే సహజంగానే ప్రపంచంలో చాలా మందికి కోపం. ఆయన అత్యంత దారుణ శిక్షలు వేయిస్తాడని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో… తాజాగా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం దెబ్బతిందనీ, విషమించిందనీ, ఆయనకు హార్ట్ సర్జరీ తర్వాత పరిస్థితి బాలేదని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా డాక్టర్ల బృందం ఉత్తర కొరియా వెళ్లి… ఆయన ఆరోగ్యాన్ని సమీక్షించిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈ మొత్తం వ్యవహారంపై ఉత్తర కొరియా స్పందించకపోవడంతో… ట్విట్టర్ యూజర్లలో చాలా మంది కిమ్ జోంగ్ ఉన్ చనిపోయి ఉంటారని ఫిక్సైపోతున్నారు.