Leading News Portal in Telugu

Telangana Elections 2023: ఎన్నికల్లో టాప్ నేతలు అంతా ఓటు వేసేది ఈ బూత్‌లలోనే!


Telangana Elections 2023: ఎన్నికల్లో టాప్ నేతలు అంతా ఓటు వేసేది ఈ బూత్‌లలోనే!

Telangana Top leaders to cast their votes in these polling stations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా కొద్దీ గంటలు మాత్రమే మిగిలి ఉంది. గురువారం ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో సినీ హీరోలు ఎవెరెవరు ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు చూశారు కదా ఇప్పుడు నేతలు ఎక్కడెక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం గురువారం ఉదయం చింతమడకకు వెళ్లనున్నారు. చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో తన సతీమణితో కలిసి సీఎం కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సమాచారం.
  • తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గురువారం ఉదయం 7.30 గంటలకు SR నగర్‌లో నారాయణ జూనియర్ కళాశాల, పోలింగ్ స్టేషన్ నంబర్ 188లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • మంత్రి హరీష్ రావు దంపతులు సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో ఉదయం 7-8 గంటల మధ్యలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు.
  • ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు కోదాడ లోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్ లో ఓటు వేయనున్నారు.
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర పట్టణంలోని సుందరయ్య నగర్ మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేయనున్నారు.
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణంలో వేయనున్నారు.
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో Both No – 160లో ఓటు వేయనున్నారు.