Leading News Portal in Telugu

Pawan kalyan : నా భార్యను తిట్టారు.. పవన్ ఎమోషనల్ కామెంట్స్..


Pawan kalyan : నా భార్యను తిట్టారు.. పవన్ ఎమోషనల్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం కీలక మలుపు తిరుగుతుంది. నేటి సాయంత్రంతో ఎలక్షన్ ప్రచారం ముగియనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి .అయితే ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం.ఈ నియోజక వర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ బరిలో నిల్చున్న గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాలలో ఓడిపోయాడు.దీనితో ఈ సారి బీజేపీ,టీడీపీలతో కూటమిగా ఏర్పడి బరిలో నిల్చున్నారు .దీనితో ఈసారి పవన్ కల్యాణ్ విజయం ఖాయమని జనసైనికులు భావిస్తున్నారు .


అయితే ఈ సారి పవన్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని పలువురు సినీ ప్రముఖులు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.మెగా ఫ్యామిలీ కూడా పవన్ కు మద్దతుగా నిలిచింది.అయితే తాజాగా పవన్ కల్యాణ్ తన సొంతవారిని రాజకీయాల్లోకి లాగి ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు .పవన్ మాట్లాడుతూ.. నా భార్యని తిట్టారు ఆమె విదేశీయురాలు ఆమెకి ఇక్కడి రాజకీయాలు తెలియవు ఎందుకు తిడుతున్నారు అని నన్ను అడిగితే నువ్వు నాతో ఒకసారి ప్రచారానికి వచ్చి చూడు నీకుఅర్థం అవుతుంది అని చెప్పాను.మన గురించి విమర్శించిండానికి ఏమి లేకపోతేనే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు.అలాంటి దిగజారుడు రాజకీయాలు నేను చేయను అని పవన్ అన్నారు .