Dharmana Krishnadas: దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చాక నేను ఎక్కడైనా ఒక్క రూపాయి తిన్నానని రామ్మోహన్ నాయుడు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో సెంటు జాగా నీకు లేదు.. 80 ఫీట్ రోడ్డులో బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉందని.. అది ఎలా వచ్చిందని రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రామ్మోహరావు నాయుడు పెద్ద వీరుడా అంటూ ఆయన అన్నారు. సరదాగా కాలక్షేపం చేసే నాయకుడు.. ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడని.. అందరిని విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆయనకు అవకాశం వాళ్ల నాన్న ఇచ్చిందని, నిలబెట్టుకుని బాధ్యతగా ఉండమని తెలిపారు. శ్రీకాకుళం ఎంపీగా మంచి అభ్యర్ధిని పెట్టాలని జగన్మోహన్ రెడ్డికి ఉందని, అందుకే అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతుందన్నారు.