Leading News Portal in Telugu

Chandrababu: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు.. విచారణ 3 వారాలు వాయిదా



Chandrababu

స్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read Also: Viral Video : వార్నీ..ఇదేం పిచ్చిరా బాబు.. గర్ల్ ఫ్రెండ్ టాటూను అక్కడ వేయించుకున్న ప్రియుడు..

చంద్రబాబు ఫ్యామిలి మెంబర్ దర్యాప్తు అధికారులను బహిరంగంగా బెదిరిస్తున్నారని సీఐడీ తరఫు న్యాయవాది ముఖుల్ రోహత్గీ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కాగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు చంద్రబాబుకు రెండు వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను మూడు వారాల తర్వాత చేపడతామని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం పేర్కొంది.

Read Also: Palnadu: పల్నాడులో కాక రేపుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలు..