
Kumari Aunty Responds to keerthi Bhat Comments on Her Food: దాసరి సాయి కుమారి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కుమారి ఆంటీ అనగానే ఆమెను ఇట్టే గుర్తుపడతారు. సుమారు 13 ఏళ్ల నుంచి హైదరాబాదులో రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోంది ఆమె. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమెకు ఈ ఏడాది మొదట్లో మంచి క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందల మంది కుమారి అండ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్దకు క్యూ కట్టడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె బిజినెస్ కూడా ఒకరోజు ఆపేశారు. చివరికి ఏకంగా రేవంత్ రెడ్డి కల్పించుకొని ఆమె బిజినెస్ కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆమె ఫుడ్ గురించి అందరూ ఒకలాగా చెబుతుంటే బిగ్ బాస్ ఫిలిం కీర్తి భట్ మాత్రం వేరేలా చెప్పింది. తన కాబోయే భర్తతో కలిసి తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక వీడియో చేసేందుకు వెళ్లిన కీర్తి కుమారి ఆంటీ చేసిన ఫుడ్ అని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. కుమారి ఆంటీ చేసిన ఫుడ్ ఏమీ బాలేదని చికెన్ ఒకటే కారంగా ఉందని అయినా ఎందుకు ఇలా ఎగబడి తింటున్నారో తనకు అర్థం కావడం లేదని కామెంట్ చేసింది.
Kiran Abbavaram: రహస్యతోనే పెళ్లి.. రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న కిరణ్ అబ్బవరం
కుమారి ఆంటీ చేసే చికెన్ కంటే తాను చేసే చికెన్ బాగుంటుందని కీర్తి భట్ కామెంట్ చేసింది. ఇక తాజాగా కీర్తి చేసిన కామెంట్ల గురించి కుమారి ఆంటీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి వచ్చిన రోజు నేను ఊర్లో లేను కాబట్టి వంట చేయలేదు. మా మగవాళ్ళు చేసిన వంటకు ఆడవాళ్లు చేసిన వంటలు తేడా ఉంటుంది కదా అని ఆమె పేర్కొన్నారు. కీర్తి బట్ అభిప్రాయాన్ని గౌరవిస్తా, నా ఫుడ్ బాగోలేదని చెప్పినంత మాత్రాన వాళ్ల గురించి నేను తప్పుగా అనుకోను. ఎందుకంటే అందరికీ నా ఫుడ్ నచ్చాలని ఎక్కడా రూల్ లేదు కదా అని కుమారి ఆంటీ కామెంట్ చేసింది. నేను వండే వంట కొంత మందికి నచ్చవచ్చు, కొంత మందికి నచ్చకపోవచ్చు అంటూ కీర్తికి కౌంటర్ ఇచ్చింది కుమారి ఆంటీ. సాధారణంగా ఆడవాళ్ళకి చేసిన వంట నచ్చలేదు అంటే కోపం నషాలానికి అంటుతుంది. వెంటనే ఆ మాట అన్న వారి మీద విరుచుకుపడతారు. కుమారి ఆంటీ కూడా కీర్తి మీద అదే విధంగా ఫైర్ అవుతుంది అనుకుంటే ఆసక్తికరంగా ఆమె కామెంట్స్ చేసింది అంటూ పలువురు చెబుతున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.