Leading News Portal in Telugu

Onion exports: ఉల్లి ఎగుమతుల కేంద్రం కీలక నిర్ణయం.. నిషేధం పొడగింపు..



Onion

Onion exports: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిరవధికంగా నిషేధాన్ని పొడగించింది. ఈ పరిణామం పలు అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరల్ని ప్రేరేపించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల ఎగుమతిదారుగా ఇండియా ఉంది. గత డిసెంబర్ నెలలో ఉల్లిపై కేంద్రం నిషేధం విధించింది, ఇది మార్చి 31 వరకు కొనసాగుతుంది. అయితే, ఈ నిషేధాన్ని మరోసారి పొడగించింది. ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో స్థానికంగా ధరలు సగానికి తగ్గాయి, కొత్తగా పంట అందుబాటులోకి వచ్చింది, దీంతో బ్యాన్ ఎత్తివేయొచ్చని వ్యాపారులు భావించారు.

Read Also: Sundaram Master : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సుందరం మాస్టర్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

తాజాగా విధించిన నిరవధిక నిషేధం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇలా బ్యాన్ విధించడం ఆశ్చర్యకరంగా ఉందని, అవసరం లేదని, ఇప్పటికే సఫ్లై పెరగడంతో ధరలు చాలా తగ్గాయని, కొత్త పంట కూడా అందుబాటులోకి వచ్చిందని ముంబైకి చెందిన ఓ ఎగుమతి సంస్థ చెప్పింది. దేశంలోనే పెద్ద మొత్తంలో ఉల్లిని ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో హోల్ సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర డిసెంబర్ నెలలో 100 కిలోలకు రూ. 4500 నుంచి ప్రస్తతం రూ. 1200కి పడిపోయింది.

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి ప్రధానిగా మోడీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఈ సమయంలో ఉల్లి ధరల్ని అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యూఏఈ వంటి దేశాలు ఇండియా నుంచి దిగుమతులపై ఆధారపడుతాయి. ఈ నిషేధం తర్వాత ఆ దేశాల్లో ఉల్లి రేట్లు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలుదారులకు వేరే మార్గం ఉండదు కాబట్టి, భారతదేశ చర్య ప్రత్యర్థి ఎగుమతిదారులు ఎక్కువ ధర కోట్ చేయడానికి అనుమతిస్తుందని ముంబైకి చెందిన ఓ ఎగుమతి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసింది.