Leading News Portal in Telugu

Arvind Kejriwal: నేటితో ముగియనున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీ..



Arvindh Kejriwal

నేటితో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు రిమాండ్ ముగియడంతో ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తుకు సంబంధించి ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరే అవకాశం ఉంది. అయితే, ఈ కేసులో సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా సహా 14 మందిని నిందితులుగా పేర్కొంది. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ఇక, లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ నేటితో ముగుస్తుంది. దీంతో కేజ్రీవాల్‌ను నేటి మధ్యాహ్నం 2 గంటలకు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

Read Also: Mahua Moitra: మహువా మొయిత్రాకు నేడు విచారణ రావాలని ఈడీ నోటీసులు..!

అయితే, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించారు. ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై తమ సమాధానం దాఖలు చేసేందుకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీకి ఏప్రిల్ 2 వరకు గడువు ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 3న జరగనుంది. అలాగే, తనను, తన పార్టీని నిర్వీర్యం చేసేందుకే.. నన్ను ఉద్ధేశపూర్వకంగా అరెస్ట్‌ చేశారని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వాదించారు.