Leading News Portal in Telugu

ఢిల్లీ ఫలితాలపై సీబీఎన్ ఎఫెక్ట్ | cbn effect in delhi elections| chandrababu| campain| areas| bjp| gain| candidates


posted on Feb 8, 2025 10:22AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాలలో ఆయన విస్తృత ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాలలోనూ బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీలోని విశ్వాస్‌ నగర్‌, సంగం విహార్‌, సహద్ర, షాదారా ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు.

తన విజన్ ను, ఎన్డీయే ప్రభుత్వ పనితీరును ఆయన తన ప్రచారం సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. వాస్తవానికి ఆయా ప్రాంతాలలో బీజేపీ గతంలో ఎన్నడూ మంచి పెర్ఫార్మెన్స్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ సారి చంద్రబాబు ప్రచారం ప్రభావం ఆ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించింది. చంద్రబాబు ప్రచారం చేసిన అన్ని ప్రాంతాలలోనూ బీజేపీ అభ్యర్థులు తిరుగులేని ఆధిక్యతతో దూసుకువెడుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ ఇక్కడ బీజేపీ హవా ప్రస్ఫుటంగా కనినించింది.  చంద్రబాబు ప్రచారం ఓటర్లపై కేంద్రంలోని మోడీ సర్కార్ పై సానుకూలతను పెంచిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.