Leading News Portal in Telugu

Mushfiqar Rahim: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన.. ‘హ్యాండిల్డ్ ది బాల్’ కారణంతో ఔట్..


Mushfiqar Rahim: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన.. ‘హ్యాండిల్డ్ ది బాల్’ కారణంతో ఔట్..

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ ‘హ్యాండిల్డ్ ది బాల్’ కారణంగా ఔట్ అయ్యాడు. దీంతో.. టెస్టు క్రికెట్‌లో ఈ విధంగా ఔటైన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. క్రికెట్‌లో అతి తక్కువగా కనిపించే ఘటనల్లో ఇదొకటి.

బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్‌లో రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. జట్టు స్కోరు 104 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు కష్టాల్లో పడి ఉంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన ముష్ఫాకర్ రహీమ్ పైనే ఆశలు పెట్టుకున్న జట్టు.. అనవసరమైన ప్రయత్నంతో పెవిలియన్ బాట పట్టాడు. న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ బౌలింగ్ లో నాల్గో బంతిని రహీం డిఫెన్స్ ఆడాడు. అయితే బంతి బ్యాట్ కు తగిలి వికెట్లకు కొంచెం దూరం పక్కకు వెళ్లింది. దీంతో.. తన వికెట్‌ను కాపాడుకోవడానికి, అతను నేరుగా చేతితో బంతిని దూరంగా నెట్టాడు.

దీనిపై న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. మైదానంలోని అంపైర్ దానిని థర్డ్ అంపైర్‌కు సూచించాడు. రివ్యూ అనంతరం ముష్ఫాకర్ రహీమ్‌ను థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించినందుకు ఔట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ముష్ఫాకర్ రహీమ్ నిలిచాడు. అయితే.. అప్పటికే బంతి వికెట్‌కు దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంతిని చేత్తో ఎందుకు తాకాడు అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. కాగా.. 2017లో బ్యాట్స్‌మెన్ తన చేతితో బంతిని తాకితే ఔట్ చేయాలనే నిబంధన ఉండేది.