Leading News Portal in Telugu

U19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తెలుగు మాటలు.. వీడియో వైరల్


U19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తెలుగు మాటలు.. వీడియో వైరల్

ఆదివారం అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పొందింది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


టీమిండియా వికెట్ కీపర్ అవనీశ్ రావు, బౌలర్ మురుగన్ అభిషేక్ మధ్య తెలుగులో సంభాషణ జరిగింది. అయితే వీరిద్దరూ హైదరాబాద్ కు చెందిన వాళ్లే. కాగా.. అభిషేక్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనకాల ఉన్న కీపన్ అవనీశ్ రావు.. బౌలర్ మురుగన్ కు తెలుగులో చెబుతున్నాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ తన సోషల్ మీడియా షేర్ చేసింది.

కాగా.. ఈ వీడియోను చూసిన తెలుగు క్రికెట్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.