- వరుసపెట్టి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోన్న మోటో
- జీ సిరీస్‌లో భాగంగా మోటో జీ85 ఫోన్
- ఎక్స్ఛేంజ్ బోనస్ కింద 1000 డిస్కౌంట్

Moto G85 5G Launch and Price in India: ఇటీవలి రోజుల్లో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ వరుసపెట్టి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఎడ్జ్ సిరీస్‌లో మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చిన కంపెనీ.. మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. జీ సిరీస్‌లో భాగంగా ‘మోటో జీ85’ పేరిట 5జీ ఫోన్‌ను నేడు భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. జులై 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మోటో జీ85 పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మోటో జీ85 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా ఉండగా.. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఆలివ్ గ్రీన్, కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మోటోరొలా వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో మోటో జీ85 లభిస్తుంది. ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.1000 వరకు డిస్కౌంట్ వస్తుంది.
మోటో జీ85 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హెలోయూఐతో వస్తోంది. ఇందులో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ పీఓఎల్‌ఈడీ స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటు, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండగా.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ప్రధాన కెమెరా 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. అది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.