Leading News Portal in Telugu

Begumpet: రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ లక్ష్మణ్…



Begumpet

Begumpet: బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఎంపీ డా. కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఢిల్లీ నుండి దేశ వ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ల పునరభివృద్దికి శంకుస్థాపన, 1500 అండర్ పాస్ లను వర్చువల్ ప్రారంభం చేస్తున్నారని తెలిపారు. రైల్వే అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వం SA రైటింగ్ నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా ఎంపికైన విద్యార్థులకు ఎంపీ బహుమతులు అందజేసామన్నారు.

554 రైల్వే స్టేషన్లు ప్రధాన మోదీ ప్రారంభించడం చాలా సంతోషం అన్నారు. మోదీ అంటే మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా అని, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కేంద్రం రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తోందన్నారు. కేంద్ర రైల్వే బడ్జెట్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కు ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ముఖ్యంగా తెలంగాణ ROB కి ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధికి GM అరుణ్ కుమార్ జైన్ ఎంతో కృషి చేస్తున్నారుని తెలిపారు.

Read also: Alleti Maheshwar Reddy: ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కమలం జెండానే..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైల్వేస్ దేశం మొత్తం లో అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ నెట్ వర్క్, తక్కువ ధర తో ఎక్కువ దూరం ప్రయాణం, సరకు రవాణాకి అనువైన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే విస్తరణ, అభివృద్ధికి మా సహకారం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కి రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా కలిసి పని చేస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయం లో ఉన్న హామీ ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెండిగ్ లో ఉంది… అది త్వరగా వచ్చేలా చూడాలని ఎంపీ లక్ష్మణ్ కి విజప్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇలాంటి ఎక్సికూషన్ కి మా సహకారం ఉంటుందన్నారు.

గవర్నర్ తమిళ సై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొంటున్నారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈనెల 27న చేవెళ్ల లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్తును అందించే పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మార్చి నెలలో అర్హులైన వినియోగదారులు 200 యూనిట్ల వరకు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.
BC Janardhan Reddy: నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నా.. నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా..!