
వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కాచిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం విజయ సంకల్ప యాత్రకు బయలుదేరారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా పద్మారావు నగర్ స్వరాజ్య ప్రెస్ చేరుకున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వీర తిలకం దిద్ది విజయం కాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన పద్మారావు నగర్, స్వరాజ్య ప్రెస్ సర్కిల్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించి యాత్ర ప్రారంభించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కొనసాగుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తున్నది. కిషన్ రెడ్డి రోడ్ షోలో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొంటున్నారు. పద్మారావు నగర్ లో ప్రారంభమైన యాత్ర సికింద్రాబాద్ మీదుగా రసూల్ పురా, బేగంపేట్, అమీర్, సనత్ నగర్ ఎర్రగడ్డ మీదుగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ దోపిడీ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కిషన్ రెడ్డి ముందుకుసాగుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో భాగంగా వాహనంలో ముందుకు వెళ్తండగా.. బిల్డింగులపై నుంచి అభిమానులు, ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు, తమ ఎంపీ కేంద్రమంత్రి తమ ముందుకు రావడంతో పైనుంచి పూలు చల్లుతు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారి అభిమానానికి కిషన్ రెడ్డి వందనం చేస్తూ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు.. కాషాయ తలపాగా ధరించి బైకు ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కిలోమీటర్ పొడవునా బైక్ ర్యాలీలతో కేంద్ర మంత్రి సంకల్ప యాత్ర రథం ముందుకు సాగుతున్నది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ కేంద్ర మంత్రి యాత్ర విజయ సంకల్పంతో ప్రవాహంలా సాగుతున్నది. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్ లలో మాట్లాడుతుండగా.. ప్రజలు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. దేశానికి మళ్లీ ఎవరు ప్రధాని కావాలని కిషన్ రెడ్డి వేసిన ప్రశ్నలకు స్పందిస్తూ.. చేయి పైకెత్తి మోదీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కిషన్ రెడ్డి కార్నర్ మీటింగ్ లకు స్వచ్ఛందంగా వేలాది మంది తరలివస్తుండటంతో కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు