Leading News Portal in Telugu

BRS KTR: కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. కేటీఆర్ ఆగ్రహం



Ktr

BRS KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు ,కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటలకు తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని ఎమ్మేల్యే కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఏడువేల కోట్లు రైతు బంధు కోసం పెట్టిపోతే అన్నారు. అవి కూడా రైతులకి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్ లకి ఆడబ్బు ఇస్తోందన్నారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మండిపడ్డారు. గతేడాది ఇదే సమయానికి నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.

Read also: Premalu: తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మలయాళం మూవీ..!

కాళేశ్వరం, కేసీఆర్ పై కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడన్నారు. ఢిల్లీకి ,హైదరాబాద్ కి తిరగడం తప్ప రైతులను పరామర్శించే సమయం రేవంత్ కి లేదన్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 200 మంది రైతులు చనిపోయారన్నారు. ఎండిపోయి పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ఎకరానికి పదివేల, 25 వేల ఎంత ఇస్తారో.. పరిహారం ఇవ్వండి అని తెలిపారు. రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలని కోరారు. రైతులకు అండగా మేమున్నాం.. కేసీఆర్ ఉన్నారన్నారు. దయచేసి ఆత్మహత్య లాంటి చర్యలకు రైతులు పాల్పడవద్దంటూ కేటీఆర్ అన్నారు.
MLC Elections: ప్రశాంతంగా సాగుతున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్..!