Leading News Portal in Telugu

Chewing Gum: యువతిపై అత్యాచారం, హత్య కేసు.. నిందితుడిని పట్టించిన ‘చూయింగ్ గమ్’’



Chewing Gum

Chewing Gum: అమెరికాలోని ఓరెగాన్‌లోని 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందు ‘‘చూయింగ్ గమ్’’ సాయం చేసింది. 1980లో 19 ఏళ్ల బార్బరా టక్కర్ అనే యువతిని ఓ వ్యక్తి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేశాడు. ఆమె మృతదేహం క్యాంపస్ పార్కింగ్ స్థలంలో దొరికింది. ఆమె మౌంట్ హుడ్ కమ్యూనిటీ కాలేజీలో విద్యార్థిగా ఉంది. మరుసటి రోజు కళాశాలకు వచ్చిన విద్యార్థులు బార్బరా మృతదేహాన్ని చూశారు. ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రకారం.. జనవరి 15, 1980న రాబర్ట్ ప్లింప్టన్ అనే వ్యక్తి బార్బరాను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడి, హత్య చేసినట్లు ఆరోపించింది.

సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. 60 ఏళ్ల వ్యక్తి గత వారం ఈ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు. అయితే, తాను నిర్దోషి అని అతను చెబుతున్నారు. ఈ కేసును అప్పీల్ చేయాలనుకుంటున్నట్లు ఆయన తరుపు న్యాయవాదులు చెప్పారు. అతని నేరారోపణలు తారుమారు చేయబడ్డాయని అతని తరుపు న్యాయవాది జాకబ్ హౌజ్ చెప్పారు.

చూయింగ్‌గమ్‌తో చిక్కిన నిందితుడు:

ఈ కేసు చూయింగ్‌గమ్‌తో ముడిపడి ఉంది. బార్బరా టక్కర్ శవ పరీక్షలో భాగంగా ఆమె యోని స్వాబ్‌లను 2000లో విశ్లేషణ కోసం ఒరెగాన్ స్టేట్ పోలీస్(ఓఎస్పీ) క్రైమ్ ల్యాబ్‌కి పంపారు. దాని నుంచి DNA ప్రొఫైల్‌ను అభివృద్ధి చేశారు. బార్బరా శరీరం నుంచి లభించిన డీఎన్ఏలో రాబర్ట్ ప్లింప్టన్ డీఎన్ఏ ఆనవాళ్ల ఉన్నట్లు గుర్తించారు. ఇలా పోలికలను గుర్తించడానికి ఈ కేసులో దశాబ్ధాల సమయం పట్టింది.

నిందితుడిగా అనుమానిస్తున్న రాబర్ట్‌పై గ్రేషమ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో డిటెక్టివ్‌లు ప్లింప్టన్ ట్రౌట్‌డేల్‌లో నివసిస్తున్నట్లు గుర్తించి, నిఘా నిర్వహించడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2021లో అతను ఉమ్మేసిన చూయింగ్ గమ్‌ని సేకరించారు. దీనిని పరీక్ష నిమిత్తం పారాబన్ నానోలాబ్స్‌కి పంపారు. 2000లో బార్బరా నుంచి వజినల్ స్వాబ్ నుంచి డెవలప్ చేసిన డీఎన్ఏ, రాబర్ట్ ప్లింప్టన్ ఉమ్మేసిన చూయింగ్ గమ్‌లోని డీఎన్ఏ సరిపోలుతుందని ప్రయోగశాల నిర్ధారించింది. దీంతో జూన్ 8, 2021న ప్లింటన్‌ని అదుపులోకి తీసుకున్నారు.

అయితే, ఈ అఘాయిత్యం జరిగిన సమయంలో ఓ మహిళ సాయం కోసం చేతులు ఊపుతున్నట్లు, ఆమె మొహం మొత్తం రక్తంతో ఉన్నట్లు, ప్యాంట్‌కి బురద ఉన్నట్లు దూరం నుంచి వెళ్తున్న సాక్షులు గమనించారు. కానీ ఎవరూ సాయం చేయలేకపోయారు. ఆ సమయంలో ఓ వ్యక్తి పొదల్లో నక్కినట్లు, ఆ తర్వాత అటవీ ప్రాంతం నుంచి క్యాంపస్ లోకి బార్బరాని తీసుకెళ్తున్నట్లు సాక్షులు నివేదించారు. ప్లింప్టన్‌ని అనుమానితుల జాబితాలో చేర్చిన తర్వాత, అతని గతాన్ని పోలీసులు తవ్వడం ప్రాంరభించారు. 1985లో టక్కర్ హత్య జరిగిన 5 ఏల్ల తర్వాత ప్లింప్టన్ ముల్ట్‌నోమా కౌంటీలో కిడ్నాప్‌కి పాల్పడి, 30 నెలలు శిక్ష అనుభవించినట్లు తేలింది. 1997లో ఒక మహిళపై దాడికి ప్రయత్నించాడు. ప్లింప్టన్‌కు జూన్ 21న శిక్ష ఖరారు కానుంది.