Leading News Portal in Telugu

Kavya Maran: ఆ ఆనందం ఎంతో సేపు లేదు.. పాపం కావ్య పాప..!



Kavya Maaran

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. సన్ రైజర్స్ ఓడిపోతామనే మ్యాచ్ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు హెన్రీచ్ క్లాసెన్. ఆ తర్వాత గెలుస్తుందని అందరూ అనుకున్నప్పటికీ క్లాసెన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఓడిపోయింది. క్లాసెన్ ఔట్ తో సన్ రైజర్స్ అభిమానులతో పాటు.. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ తీవ్ర నిరాశ చెందింది.

RR vs LSG: లక్నో ముందు భారీ స్కోరు.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంజూ

అంతకుముందు భారీ సిక్సులతో విరుచుకుపడిన క్లాసెన్ ఆట చూసి కావ్య పాప గంతులేసింది. ఇక మ్యాచ్.. గెలుస్తామనే ఆశ బోలెడంత కలిగింది. అయితే ఈ సంతోషం ఆమెకు ఎంతో సేపు నిలబడలేదు. చివరి ఓవర్లో 5వ బంతికి కేకేఆర్ ఫీల్డర్ సుయాష్ శర్మ పట్టిన క్యాచ్ ఆ మ్యాచ్ ను మలుపుతిప్పింది. దీంతో కావ్య ముఖ్యంలో చిరునవ్వు మాయమైపోయింది. ముఖం మొత్తం ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. అయితే అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Chewing Gum: యువతిపై అత్యాచారం, హత్య కేసు.. నిందితుడిని పట్టించిన ‘చూయింగ్ గమ్’’

కేకేఆర్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 4 పరుగుల తేడాతో ఓటమి చెందింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌ చివరి బంతి వరకు హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. బ్యాటింగ్లో రసెల్‌ 25 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 210 పరుగుల లక్ష్య ఛేదనలో హెన్రిచ్‌ క్లాసెన్‌ 29 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అందులో మొత్తం 8 సిక్సర్లు ఉన్నాయి.