Leading News Portal in Telugu

Mythri Movie Makers: తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్


  • తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్

  • ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌

  • “శ్రీమంతుడు” బ్లాక్‌బస్టర్‌తో 2015లో ప్రొడక్షన్‌లోకి అడుగులు
Mythri Movie Makers: తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్

FC-Ormax 2024: ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌ను ప్రకటించింది. పవర్ లిస్ట్‌లో ఉన్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ “మైత్రీ మూవీ మేకర్స్”. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” బ్లాక్‌బస్టర్‌తో 2015లో ప్రొడక్షన్‌లోకి ప్రవేశించి, జనతా గ్యారేజ్ మరియు రంగస్థలంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మైత్రీ మూవీ మేకర్స్ 9 సంవత్సరాలలో భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇక 2023లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్టెయిర్ వీరయ్య మరియు వీరసింహా రెడ్డిలతో ముందుకు వచ్చారు. అవి కూడా మంచి కలెక్షన్స్ వసూళ్లు చేశాయి. ఇక ఇదే ప్రొడక్షన్ హౌస్ రెండు జాతీయ-అవార్డ్-విజేత చిత్రాలను అందించింది. ఒకటి అల్లు అర్జున్ నటించిన పుష్ప ఇంకొకటి యువతను ఒరుతాలు ఊగించిన ఉప్పెన మూవీ.

ఈ రెండు సినిమాలు బడ్జెట్ కి రెండింతల కలెక్షన్స్ సాధించాయి. ఇక అల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయితే, సీక్వెల్ పుష్ప 2 కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలానే సన్నీడియోల్ మరియు గోపీచంద్ మలినేనిల చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ పెట్టబోతున్నారు. ఇదే సమయంలో నడికర్ చిత్రంతో మలయాళ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రొడక్షన్ హౌస్ అజిత్ యొక్క గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇతర భాషలలో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి మరియు రామ్ చరణ్ బుచ్చిబాబు వంటి ఆసక్తికరమైన కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టింది.