Leading News Portal in Telugu

Kamal Haasan: రాముడు అగ్నిపరీక్ష నిర్వహించినట్లే.. ఈవీఎంలను పరీక్షిస్తాం..



Kamal Haasan

Kamal Haasan: ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఈవీఎంలపై ఇండియా కూటమి నేతలు వ్యతిరేకం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈవీఎంలను నిందించడంలో అర్థం లేదని, ఎందుకంటే కారు యాక్సిడెంట్ అయితే కారణం కారుది కాదని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఈవీఎంలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.

Read Also: Manda Krishna: ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం

ఈ రోజు తమిళనాడులో జరిగిన సభలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. కారు ప్రమాదం జరిగితే కారు బాధ్యత ఉండదని, డ్రైవర్ బాధ్యత ఉంటుందని, అదే విధంగా ఇప్పుడు మన లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈవీఎంలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఎలా ఉండాలో ప్రజలే చెప్పాలని అన్నారు. నేను ఎవరిని ఎగతాళి చేయడం లేదని, వాళ్ల దేవుడు(బీజేపీని ఉద్దేశిస్తూ) శ్రీరాముడు సీతకి అగ్నిపరీక్ష చేశాడు కదా, అదే విధంగా ఈవీఎంల పనితీరు ఎలా ఉందో పరీక్షించాలని అన్నారు.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ అధికార డీఎంకేతో జట్టుకట్టింది. పొత్తులో భాగంగా డీఎంకే 2025లో ఒక రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని కమల్ చెప్పారు. డీఎంకే, ఇండియా కూటమి తరుపును తమిళనాడు 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.