Leading News Portal in Telugu

RR vs LSG: లక్నోపై రాజస్థాన్ సూపర్ విక్టరీ..



Rr Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలుపొందింది. 20 పరుగుల తేడాతో లక్నోపై రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని లక్నో ముందు ఉంచిన రాజస్థాన్.. 173 పరుగులకే కట్టడి చేసింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

Ipl New Ad2024

Pakistan Cricket Board: టీ20 ప్రపంచకప్‌కు ముందు సెలక్షన్ కమిటీని రద్దు చేసిన పీసీబీ..

లక్నో బ్యాటింగ్ లో నికోలస్ పూరన్ (64 *), కేఎల్ రాహుల్ (58) రాణించినప్పటికీ మ్యాచ్ గెలువలేకపోయింది. లక్నో బ్యాటింగ్ లో ఓపెనర్ క్వింటాన్ డికాక్ (4) పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దేవ్ దత్ పడిక్కల్ డకౌట్ కాగా.. ఆయూష్ బదోని ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. దీపక్ హుడా (26), కృనాల్ పాండ్యా (3), స్టోయినీస్ (3) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్ కీలక 2 వికెట్లు పడగొట్టాడు. నాంద్రే బర్గర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలో వికెట్ సంపాదించారు.

Vizag Drugs Case: డ్రగ్స్ కంటైనర్ కేసు.. కీలకంగా మారిన నార్కోటిక్స్ ల్యాబ్ సర్టిఫికెట్

అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత జాస్ బట్లర్ (11) చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ (43), ధ్రువ్ జురేల్ (20), హెట్ మేయర్ (5) పరుగులు చేశారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. లక్నో ముందు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచాడు. ఇక.. లక్నో సూపర్ జేయింట్స్ బౌలింగ్ లో నవీన్ ఉల్ హుక్ 2 వికెట్లు తీశాడు. మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ సంపాదించారు.