Leading News Portal in Telugu

Sanju Samson: వరుసగా ఐదు సీజన్లలో.. సంజూ వల్లే సాధ్యం



Samson

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్‌ జెయింట్స్‌-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌ అరుదైన ఘనత సాధించాడు. 33 బంతులు ఆడిన సంజూ.. హాఫ్‌ సెంచరీ చేశాడు. అంతేకాకుండా.. వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్‌ మ్యాచ్‌ల్లో 50 పరుగులు అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా సంజూ నిలిచాడు.

Ipl New Ad2024

Read Also: Delhi: 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. పరిస్థితి ఉద్రిక్తం..

2020-2024 సీజన్ రాజస్థాన్ ఓపెనింగ్ మ్యాచ్లో సంజూ ఇన్నింగ్స్..
2020 చెన్నైపై 32 బంతుల్లో 74 పరుగులు
2021 పంజాబ్ పై 119 పరుగులు
2022 సన్ రైజర్స్ హైదరాబాద్ పై 55 పరుగులు
2023 సన్ రైజర్స్ హైదరాబాద్ పై 55 పరుగులు
2024 లక్నో సూపర్ జెయింట్స్ పై 60 పరుగులు

Read Also: Vijayasai Reddy: ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆరు సీట్లే వస్తాయి.. విజయసాయి కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌ చరిత్రలో ఇలా సీజన్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌ల్లో వరుసగా 50కు పైగా స్కోర్లు సాధించడం చాలా అరుదుగా జరిగింది. కేవలం సంజూ శాంసన్ వల్లే సాధ్యమైంది. ఇక.. మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (24), జోస్‌ బట్లర్‌ (11), సంజూ శాంసన్ (82) రియాన్‌ పరాగ్‌ ఔట్‌ (43), హెట్‌మైర్‌ (5) పరుగులు చేశారు.